వైయస్ వర్ధంతి వేడుకలు... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, September 03, 2020

వైయస్ వర్ధంతి వేడుకలు...


మణుగూరు. సెప్టెంబర్ 2 (శుభ తెలంగాణ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి 11వ వర్ధంతి కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చందా లింగయ్య దొర మాట్లాడుతూ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానేత, ప్రజల మనిషి డాక్టర్ వైఎస్ఆర్ అని కొనియాడారు. మండల అధ్యక్షులు గుర జాల గోపి మాట్లాడుతూ ప్రతి మనిషికి సొంత ఇల్లు, ఉచిత ఆరోగ్యం, అందరికీ ఉపాధి ఉండాలనే లక్ష్యంతో దేశంలో ఎవరు ప్రవేశపెట్టనన్ని పథకాలు వైఎస్ఆర్ ప్రవేశపెట్టడం, ఈరోజుకి కూడా ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవ్వడం పేద ప్రజల అదృష్టమన్నారు. ఆయన అకాల మరణం చెందడంతో అనేకులు ఆవేదన తో చనిపోవడం జరిగిందని, ఇంతటి మహా నాయకుడు దేశ చరిత్రలో ఎవరూ లేరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందా సంతోష్, పట్టణ అధ్యక్షులు నవీన్, మధు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.