వర్షాల వలన బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 01, 2020

వర్షాల వలన బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం


మణుగూరు. ఆగస్టు 31, శుభ తెలంగాణ) ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాల కార ణంగా అనుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోలేక పోయామని మణుగూరు ఏరియా జిఎం జక్కంరమేష్ తెలిపారు. అకాల వర్షా లు, కరోనా ప్రభావంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆంతరాయం కలిగిందని, ఆగస్ట్ నెలలో 775000 టార్గెట్ కాగ, 450421 మాత్రమే ఉత్పత్తి చేయ గలిగామ్మన్నారు. ఓబి 38శాతం వెలికి తీయగలిగామని, 56 రేకులు, 33 వ్యాగన్ల ద్వారా బొగ్గు రవాణా చేయడం జరిగిందన్నారు. ఉత్పత్తి లోటును పూడ్చడానికి నిర్దిష్ట ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వార్షిక లక్ష్యాన్ని సమిష్టి కృషితో గడువు లోపు పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మణుగూరు ఏరియా లో సోలార్ ప్లాంట్ నిర్మించడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ బిఎస్ఎన్ఎ ఆధ్వర్యంలో 150 ఎకరాలలో 125 కోట్ల వ్యయంతో లక్ష సోలార్ ప్యానల్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 30 మెగావాట్ల సోలార్ పవర్ ద్వారా సంవత్సరానికి 11 కోట్ల రూపాయల ఆదాయం సింగరేణికి సమకూరనుందని తెలిపారు. ఆగస్టు నెలలో 1225 కరోనా టెస్ట్ లు చేయగా, 249 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, వీరిలో ఉ ద్యోగస్తులు 125 మంది, డిపెండెంట్లు 106 గా ఉన్నారని అన్నారు. ఐసోలేషన్ వార్డులోను ప్రతి రోజూ పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని ఆయన సూచించారు.