మన్యంలో అపశృతి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, September 17, 2020

మన్యంలో అపశృతి..


చర్ల సెప్టెంబర్ 16(శుభ తెలంగాణ) : చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణ లో భాగంగా చెన్నపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ కు వెళ్ళిన ఆర్ఎస్ఎ ఆదిత్య సాయికుమార్(25) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి విడుదల అయిన వివరాల ప్రకారం చర్ల మండలం లోని చెన్నాపురం అటవీ ప్రాంతానికి మంగళవారం రాత్రి పోలీసు బృందంతో పాటు వెళ్ళిన ఆర్ఎస్ఈ ఆదిత్య కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా సుమారు బుదవారం తెల్లవారు ఝామున 2:44 సమయంలో ప్రమాదవశాత్తు ఆదిత్య చేతిలోని ఆయుధం మిస్ ఫైర్ కావడంతో మృతి చెందినట్టు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. బిటెక్ పూర్తి చేసిన ఆదిత్య 2018 సంవత్సరం బిఎస్ఎస్ పి బ్యాచ్ కి చెందినవారు. ఆదిత్య అకాల మరణం పట్ల సంతాపం తెలిపిన జిల్లా ఎస్పీ సునిల్ దత్ ఐపిఎస్,