పులి సంచారంతో ప్రజల్లో ఆందోళన - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, September 04, 2020

పులి సంచారంతో ప్రజల్లో ఆందోళన


భూపాలపల్లి, సెప్టెంబర్ 03 శుభ తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవుల్లో పులి సంచరిస్తుందన్న వార్తలతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అడవుల్లోకి పులి రావడం సంతో షకరమని డీఎఫ్ ఓ పురుషోత్తం అన్నారు. కొత్తగా ఎక్కడ అడుగు జాడలు కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అటవీ గ్రామాల ప్రజలు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నా రు. ఒకరిద్దరు అడవుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని, వేట కోసం విద్యుత్ తీగలు, ఉచ్చులు ఎవరూ అమర్చకూడదన్నారు. నాలుగు రోజులుగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులిని.. మగపులిగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. తాడో బా లేదా ఇంద్రావతి అడవుల నుంచి రావొచ్చని అంచనా వేశా రు పులికి ఎటువంటి హాని జరగకుండా అటవీశాఖ అధికారులు అప్రమత్తం అవుతుండగా.. అటవీ గ్రామాల ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. దట్టమైన అడవులు కలిగిన జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహ దేవపూర్ సమీప అడవు ల్లో 2003లో ఏడు పులులు ఉన్నట్లు గా అప్పటి అటవీశాఖ అధికారులు గుర్తించారు. అనంతరం 2009లో పాకాల సమీపంలోని రాంపూర్ అడవుల్లో ఒక పులి కనిపించింది. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడా పులుల జాడ కనిపిం చలేదు. కాగా గత నెల 30న మహాముత్తారం మండలం యామన్పల్లి అడవుల్లో పులి అడుగులను జిల్లా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే నిమ్మగూడెంకు చెందిన ఓ రైతు తన ఆవు మేతకు వెళ్లి అడవిలో మృత్యువాత పడినట్లుగా గుర్తించాడు. మృతి చెందిన ఆవుపై పులి గాట్లు స్పష్టంగా కనిపించాయి. సోమవారం అదే పులి మహాముత్తారం మండలంలోని మహబూబపల్లి సమీపంలో గల బంగారు బాట మీదుగా, ఈ నెల 1న రాత్రి మరోమారు యామన్పల్లి- ఆజం నగర్ అడవుల్లో సంచరించినట్లుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే బుధవారం సాయంత్రం మళ్లీ అదే పులి అడుగులు మలర్ మండలంలోని కిషన్ రావుపల్లి సమీప అటవీ ప్రాంతంలో కనిపించడంతో అటవీశాఖ అధికారులతో పాటు అటవీ గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లా అడవుల్లో పులి నాలుగు రోజులుగా సంచరిస్తుందనే వార్త దావనంలా వ్యాపించింది.