అక్రమ ఇసుక రవాణా చేస్తే.. కఠిన చర్యలు : కలెక్టర్ డా.ఎం.వి రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 16, 2020

అక్రమ ఇసుక రవాణా చేస్తే.. కఠిన చర్యలు : కలెక్టర్ డా.ఎం.వి రెడ్డి


భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, సెప్టెంబర్ 15 (శుభ తెలంగాణ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్ విచారణ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా ఎంవి రెడ్డి తెలిపారు. మంగళవారం ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలపై తహశీల్దారులు, మైనింగ్, టీఎస్ ఎండిసి అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. వేల క్యూబ్ క్ మీటర్లు లసుక అక్రమంగా తీస్తున్న జిల్లా యంత్రాంగం దృష్టి సారించకపోవడం అత్యంత విచారకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక తీయుటలో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు అదనపు కలెక్టర్ అనుదీప్ ను ప్రత్యేక విచారణ అధికారిగా నియమిస్తున్నట్లు ఆయన చెప్పారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్న. రవాణా చేస్తున్న వ్యక్తులపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. విచారణలో వచ్చిన నివేదికలు ఆధారంగా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టీఎస్ ఎండిసి అధికారుల దృష్టికి కూడా రాకపోవడం చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటిడిఎ పిఓ గౌతమ్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.