ఉగ్ర కరోనా! - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, September 12, 2020

ఉగ్ర కరోనా!


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11 : భారత్ లో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. వరుసగా రెండో రోజూ 95 వేలకు పైగా కరోనా కేసులునమోదయ్యాయి. నిన్న 95,735 పాజిటివ్ కేసులు నమోదవగా, ఈ రోజు మరో వెయ్యి అధికంగా రికార్డయ్యాయి. దీంతో 45 లక్షల మార్కును దాటాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 96,551 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసులు 45,62,415లకు చేరాయి. ఇందులో 9,43,480 కేసులు యాక్టివ్ గా ఉండగా, మరో 35,42,664 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక గురువారం ఉదయం నుంచి శు క్రవారం ఉదయం వరకు 1209 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య 76,271కు చేరింది. ఇప్పటివరకు ఒక్కరోజులో కరోనాతో ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 10 వరకు 5,40,97,975 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. అదేవిధంగా గురువారం ఒకే రోజు 11,63,542 నమూనాలను పరీక్షించామని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 1209 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 76,271 కు చేరుకుంద ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 35,42,664 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,43,480 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20, 68 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 77.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.67 శాతానికి పడిపోయిందని తెలిపింది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,63,542 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... ఇప్పటివరకు 5,40,97,975 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది.