స్థలాల క్రమబద్దీకరణ పై ప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, September 27, 2020

స్థలాల క్రమబద్దీకరణ పై ప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

కూకట్ పల్లి సెప్టెంబర్ 26(శుభ తెలంగాణ )పేద, మద్య తరగతి ప్రజలకు మేలు కలిగేందుకు స్థలాలను క్రమబద్దీకరణ విషయమై గ్రేటర్ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూకట్పల్లి ఎమ్మెల్యే  మాధవరం కృష్ణారావు, నియోజకవర్గ కార్పోరేటర్లు, జోనల్ కమిషనర్ మమత పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అవినీతిని పాతర వేసి పారదర్శకత కు పెద్ద పీట వేసి నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చారని  అన్నారు. పేద మధ్య తరగతి ప్రజలు భూ యాజమాన్య హక్కు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని, వ్యవసాయ, వ్యవసాయేతర భూములు క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని , గ్రామాలు, నగరాల్లోని నోటరీ భూములను క్రమబద్దీకరణ వల్ల, ప్రజలు బ్యాంకు రుణాలు పొందడానికి సులభతరం అవుతుంది అని చెప్పారు.అలాగే కూకట్పల్లి నియోజకవర్గం లోని హౌసింగ్ బోర్డు మరియు ఇతర ప్రాంత  స్థల సమస్యలను పరిష్కరించాలని  ఆయా కాలనీ అసోసియేషన్ సభ్యులు కోరగా మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ నుండి మూసాపేట్ డివిజన్ అవంతి నగర్ తోట వరకు ప్రైవేటు స్థలాలను  నోటరీ ద్వారా కొనుగోలు చేయడంతో మ్యుటేషన్ జరగడం లేదని, బ్యాంకు రుణాలు రాక పిల్లలను పై చదువులు చదివించ లేకపోతున్నామని మంత్రి దృష్టికి తీసుకెళ్ళగా త్వరలోనే ముఖ్యమంత్రి  ఈ విధమైన సమస్యలను పరిష్కరిస్తారని మంత్రి హామీ ఇచ్చారన్నారు.  ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు తూము శ్రావణ్ కుమార్,పండాల సతీష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, నరేంద్ర ఆచార్య,మందాడి శ్రీనివాస్,సబిహా గౌసుద్దీన్, తరుణి తదితరులు పాల్గొన్నారు.