గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణపయ్య... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 02, 2020

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణపయ్య...


హైదరాబాద్ సెప్టెంబర్ 1(శుభ తెలంగాణ) : నగరంలో గణేశ్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. భక్తుల జయజయధ్వానాల నడుమ హుస్సేన్‌సాగర్‌లోని నాలుగో నంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయింది. కరోనా కారణంగా ఈసారి కేవలం 9 అడుగుల మట్టి విగ్రహాన్ని ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులు రూపొందించారు.