ఈతను పాఠ్యాంశంలో చేర్చాలని మంత్రులకు వినతి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, September 05, 2020

ఈతను పాఠ్యాంశంలో చేర్చాలని మంత్రులకు వినతి


కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 4 (శుభ తెలంగాణ) : ఈతను పాఠ్యాంశంలో చేర్చాలని సామాజిక కార్యకర్త కోల రవీందర్ ముదిరాజ్ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఎంతోమంది యువతీ, యువకులు సరదాగా నీటిలో దిగుతున్నారని ఈత రాకపోవడంతో విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈతను పాఠ్యాంశంలో చేర్చి అవగాహన కల్పిస్తే మేలు జరుగుతుందని కోరారు. దీనికి మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు సామాజిక కార్యకర్త కోల రవీందర్ ముదిరాజ్ తెలియజేశారు.