ప్రజ్ఞపూర్ రాజీవ్ రహదారి వద్ద.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, September 04, 2020

ప్రజ్ఞపూర్ రాజీవ్ రహదారి వద్ద.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి


గజ్వెల్: సెప్టెంబర్ 8 (శుభ తెలంగాణ) : ఉదయం అందాజ 3:15 గంటల సమయమున రాజీవ్ రహదారి ప్రజ్ఞాపూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఒక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటన స్థలాన్ని పోలీస్ కమిషనర్ శ్రీ డి. జోయల్ డేవిస్ ఐపీఎస్, గజ్వేల్ ఏసీపీ నారాయణ, గజ్వేల్ సిఐ ఆంజనేయులు కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి జరిగిన ప్రమాదం గురించి అన్వేషించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ రాత్రి సమయాల్లో లారీలు రోడ్డుపైన నిలవదని, పోలీసు అధికారులు సిబ్బంది రాత్రి పెట్రోలింగ్ చేసే సమయాల్లో రోడ్డుపైన వాహనాలు ఉంటే వెంబడే అక్కడ నుండి పంపించాలని తెలిపారు. రాత్రి సమయంలో అత్యవసర పరిస్థితులలో ఏదైనా వాహనం బ్రేక్డౌన్ అయితే వచ్చిపోయే వాహనాలకు కనపడే విధంగా అన్ని సేఫ్టీమేజర్ తీసుకోవాలని వాహనదారులకు సూచించా రు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడిపి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.