పెండింగ్ లో ఉన్న పెన్షన్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, September 11, 2020

పెండింగ్ లో ఉన్న పెన్షన్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి


కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 10(శుభ తెలంగాణ) : నాలుగవ రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వలస కూలీలు, దివ్యాంగులు ఎదుర్కొంటున్న పెన్షన్ దరఖాస్తు సమస్యలపై తలెత్తుతున్న పలు ఇబ్బందుల గురించి పంచాయతీ రాజ్, గ్రామీణాభిృద్ధి, ఆర్డబ్ల్యుఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని పలు ప్రశ్నలు అడిగారు. జనసాంద్రత పరంగా అత్యధిక జనాభా ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కావడం, పలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అధిక సంఖ్యలో ఉండటంతో దేశ, రాష్ట్ర నలుమూలల నుండి భారీగా వలస కూలీలు జీవనం కోసం వస్తున్నారని, వీరిలో అనేక మంది ప్రభుత్వం అందిస్తున్న పలు రకాల పెన్షన్ ల కోసం దరఖాస్తులు చేసుకోగా వెరిఫికేషన్ ప్రక్రియలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసి పరిధిలో ఇటువంటి దరఖాస్తులు ఎన్ని నమోదు అవుతున్నాయో, వాటి వెరిఫికేషన్ ప్రక్రియ ఎంత వరకు పూర్తి అయ్యాయో, మిగిలిన దరఖాస్తులు కలెక్టర్ వద్ద ఎన్ని ఉన్నాయో పూర్తి వివరాలు సభకు తెలపాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో జీహెచ్ఎంసీ పరిధిలో బస్తీ దావఖానలను పెంచడం సంతోషకరమని, అయితే దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదరన్ క్యాంప్ లను తరచూ నిర్వహించాలన్నారు. సైకిల్ పద్ధతిలో సదరన్ క్యాంపు నిర్వహిస్తే దివ్యాంగులకు పెన్షన్ తీసుకోవడం సులభతరం అవుతుందని ఈ సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.