జిల్లా కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, September 10, 2020

జిల్లా కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు..


జిల్లా కలెక్టర్ మేడ్చల్ జిల్లా, శుభతెలంగాణ : జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కెసిఆర్ కూరగాయల మార్కెట్ కు ఎదురుగా ఉన్న సర్వేనెంబర్ 432 (పి) 1500 గజాల, ప్రభుత్వ స్థలంలో మోడ్రన్ షీ టాయిలెట్స్ ,కోసం మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఫిబ్రవరి నెలలో షి టాయిలెట్స్ నిర్మాణ పనుల కోసం ఈ స్థలాన్ని అధికారికంగా కేటాయించ డం జరిగింది. అయిన జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి, కమిషనర్ శ్రీనివాస రావు, డి.ఇ కృష్ణ. ఈ స్థలాన్ని పరిశీలించి మూడు సార్లు భూమి పూజ చేసిన పిటాయిలెట్స్ నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగలేదు. జవహర్‌నగర్ లో ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు, ఆందోళనలు చేసిన అధికారులకు వినతి పత్రాలు అందించిన స్పందన లేదు, అయితే జవహర్ నగర్ లో ఇప్పటివరకు లక్షల్లో జనాభా ఉన్న కార్పొరేషన్ లో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్న కనుచూపు మేరలో ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాల కోసం ఏలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం శోచనీయం అని ప్రజలు వాపోతున్నారు సరే. ప్రజల అవసరాల కోసం ఉపయోగపడే జవహర్ నగర్ పాలకవర్గం అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవరిస్తున్నారు. అయితే కోట్ల రూపాయలు విలువ చేసే ఈ స్థలాన్ని కొట్టేయడానికి జవహర్ నగర్ అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల అండదండలతో ఈ స్థలాన్ని కాజేయడానికి పెద్ద మొత్తంలో అధికార పార్టీ నాయకులకు డబ్బులు చేతులు మారినట్టు వదంతులు వినిపిస్తు న్నాయి. ఈ పనులకు ఆటంకం కలిగిస్తున్న స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారుల పై తక్షణమే జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు,స్పందించి ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలంలో యధావిధిగా మోడ్రస్ షిటాయిలెట్స్ నిర్మాణ పనులు కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ,ప్రజా సంఘాల నాయకులు , ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.