గిరిజనాభివృద్ధికి పాటుపడాలి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 01, 2020

గిరిజనాభివృద్ధికి పాటుపడాలి..


భద్రాద్రి జిల్లా బ్యూరో. ఆగస్టు 31(శుభ తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎంపీ లాడ్స్ నిధులతో ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలకు ఉ పయోగపడే పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత అన్నారు. సోమవారం సాయంత్రం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ ఏం వి రెడ్డి, పి ఓ గౌతమ్ లతో పాటు ఎంపీ కవిత వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ ఎంపీలాడ్స్, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాలో ఎన్ని పనులు పూర్తయ్యాయని, కాకపోతే కారణమేంటని తెలుసుకొన్నారు. పనుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించిన కూడదని, ఏదైనా సమస్య ఉంటే తగువిధంగా పరిష్కరించి గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. భద్రాచలం ఐటీడీఏ ద్వారా గిరిజన అభివృద్ధి కోసం అర్హులైన గిరిజనులకు సంక్షేమ ఫలాలు అందేవిధంగా గా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని, 336 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని, త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ వివరించారు. లో