మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, September 06, 2020

మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి..


మేడ్చల్ జిల్లా సెప్టెంబర్ 5(శుభ తెలంగాణ) జర్నలిస్టుగా 30 సంవత్సరాల పాటు సేవలం దించిన మెరుగు చంద్రమోహన్ గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా శనివారం కాప్రా జర్నలిస్టు మిత్రులు, స్నేహితులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికే యులు బెలిదే అశోక్, ఎంపల్లి పద్మారెడ్డి, యావపురం రవిలు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, పట్టుదల, అంకిత భావం కలిగిన జీవితంతో ఎంతో మంది జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శనిగరం అశోక్, రమేష్, వాసు, ఆంజనేయులు, వెంకట్, ముత్యం ముఖేష్ గౌడ్, కోట్ల రాజు, మెరుగు విష్ణు మోహన్, దొమ్మటి కిరణ్ కుమార్ రావు, కట్కూరి విజయ్ కుమార్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, మైలారం నర్సింగరావు, శివ తదితరులు పాల్గొన్నారు.