ప్రభుత్వం నిషేధించిన టొబాకో, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన గౌరారం పోలీసులు. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, September 27, 2020

ప్రభుత్వం నిషేధించిన టొబాకో, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన గౌరారం పోలీసులు.

గజ్వేల్: సెప్టెంబర్26(శుభ తెలంగాణ)శనివారం  సాయంత్రం 4 గంటల సమయమున వేలూరు గ్రామం వీర మణికంఠ కిరాణా షాపులో ప్రభుత్వం నిషేధించిన టొబాకో మరియు గుట్కాలు అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం రాగా, గౌరారం ఎస్ఐ వీరన్న సిబ్బందితో వెళ్లి కిరాణా షాపు పై రైడ్ చేసి విమల్, సాగర్, స్వాగత్, బుల్బుల్, మీరజ్ కంపెనీలకు చెందిన టుబాకో మరియు గుట్కాలు 50 వేల రూపాయల విలువ గలవి స్వాధీనం చేసుకుని షాపు యజమాని మల్లె రాజు తండ్రి రాజా వీరయ్య, పై కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్ఐ వీరన్న మాట్లాడుతూఎవరైనా గుట్కాలు కలిగి ఉన్నా, షాపుల్లో అమ్మిన, అక్రమ రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం నిషేధించిన టొబాకో, గుట్కాలు కలిగి ఉన్నారని ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 7901100100

 సమాచారం అందించాలని సూచించారు.