ఉపాధ్యాయులను పట్టించుకునే వారే లేరు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 08, 2020

ఉపాధ్యాయులను పట్టించుకునే వారే లేరు


సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 7(శుభ తెలంగాణ) : యువజన సంఘాల నాయకులు బలరాం,మెట్టు శ్రీధర్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం లో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ రాష్ట్రం లో అసలు ప్రభుత్వపాలన నడుస్తుందా లేదా అని ప్రశ్నిస్తూ ప్రవేటు పాఠశాలల ఉపాధ్యాయులు మరియు లెక్చరర్లు కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉపాధి కోల్పోయిన వారికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు బోధిస్తున్నప్పటికి దానిలో లోటుపాట్లను పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలమయ్యిందని దాని పూర్తి బాధ్యత ప్రభుత్వ ఉ పాధ్యాయులపై నెట్టవేసి విద్యాశాఖ చేతులు దులుపుకోవడం సబబు కాదని అన్నారు. అలాగే విద్యార్థులకు మధ్యాహ్నాబోజనాన్ని అందిచడం లేదు కాబట్టి ఆ ఖర్చులను విధ్యార్థులకు అందించి వారి కుటుంబాలకు లబ్ది చేకుర్చాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ క్లాసుల పేరుతో ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్న ప్రవేటు పాఠశాలల పై చర్యలు తీసుకుని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అండగా నిలబడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.