ఇసుక ర్యాంపులు పర్యవేక్షణ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, September 05, 2020

ఇసుక ర్యాంపులు పర్యవేక్షణ


మణుగూరు సెప్టెంబరు 04(శుభతెలంగాణ): మండల పరిధిలో అనుమతులు పొందిన సాంబాయిగూడెం రెండు ర్యాంపులు, అన్నారం, చిన్న రావిగూడెం సొసైటీ ర్యాంపులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గనుల శాఖ అదనపు డైరెక్టర్ జై సింగ్ గురువారం పర్యవేక్షించారు. మణుగూరు లో అక్రమంగా ఇసుక నిల్వలు ఉ న్నాయని పలు పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి ఆదేశాల మేరకు మణుగూరు లో ఉన్న గిరిజన సొసైటీ ర్యాంపులను పర్యవేక్షించ డం జరిగిందన్నారు. అన్నారం సమ్మక-సారక్క గిరిజన సొసైటీకి అన్ని అనుమతులు ఉన్నాయని అలాగే చిన్న రాయి గూడెం కూడా గిరిజన సొసైటీ ర్యాంపులకు పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏలాంటి అక్రమ ఇసుక రవాణా చేసిన అనుమతులు లేకుండా లారీ రోడ్లపై తిరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం టీఎస్ఎండీసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ మాట్లాడుతూ అనుమతు లు పొందిన గిరిజన సొసైటీ ర్యాంపుల్లో ఉపాధి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూలీలను పెట్టి ట్రాక్టర్ల ద్వారా ఇసుక డంపులు చేసుకోవాలని, అనంతరం లారీ ల్లో లోడ్ చేసుకునేందుకు జెసిబి యంత్రాలను వాడుకోవచ్చునని తెలిపారు. అలా కాకుండా గోదావరి నదిలో మిషన్లతో ఇసుకను తీస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మణుగూరులో మొత్తం నాలుగు సొసైటీ అనుమతులు ఉ న్నాయని దీనికి సంబంధించిన పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతి పత్రాలను మీడియా కు చూపించారు. ఈ కార్యక్ర మంలో మణుగూరు తాసిల్దార్ లూధర్ విల్సన్, ఆర్ ఐ రామ య్య, టీఎస్ఎండీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.