అభివృద్ధి పనులపై కార్పొరేటర్లతో.. ఎమ్మెల్యే కేపి సమీక్ష.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, September 06, 2020

అభివృద్ధి పనులపై కార్పొరేటర్లతో.. ఎమ్మెల్యే కేపి సమీక్ష..


కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 5(శుభ తెలంగాణ) :కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎనిమిది డివిజన్‌ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు మరియు టీఆర్ఎస్ నాయకులతో శనివారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చింత లోని తన కార్యాలయం వద్ద అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసీ పరిధిలో కోట్ల రూపాయల నిధులతో ప్రతి డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధిపర్చామని, గతంలో ఇచ్చిన ప్రతి హామీలను టిఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు. మానిఫెస్టోలో లేని ఎన్నో అభివృద్ధి పనులను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. ఇటు సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ లక్షల రూపాయల చెక్కులను ఇంటింటికీ తిరిగి అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. మరే ఇతర ప్రాంతాల్లో మిగిలిఉన్న చిన్నపాటి రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉంటే సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరింత కష్టపడాలన్నారు. ఎటువంటి సమస్య ఏర్పడినా నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్య ల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుల శేషగిరి రావు, కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు మహ్మద్ రఫీ, దేవగారి రాజేందర్ రెడ్డి, కేఎం గౌరీష్, యువ నాయకులు కేపీ విశాల్ గౌడ్ పాల్గొన్నారు.