ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా.. ఆన్లైన్ పాఠాలు బోధించాలి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, September 05, 2020

ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా.. ఆన్లైన్ పాఠాలు బోధించాలి


గజ్వెల్ సెప్టెంబర్ 4 (శుభ తెలంగాణ) భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎన్ఎస్ఏ) సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, గజ్వేల్ టౌన్ లో ఆన్ లైన్ విద్యపై, ఆన్లైన్ సర్వే నిర్వహిం చడం జరిగింది. ఈ సర్వే ఉద్దేశించి సిద్దిపేట ఎస్ఎస్ఏ జిల్లా సహాయ కార్యదర్శి రాజు మాట్లా డుతూ, ఈ సర్వేలో తమ దృష్టికి వచ్చిన కొన్ని అంశాలు ఈ విధంగా ప్రస్తావించారు. ఆన్లైన్ విద్య వల్ల ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థులు నష్టపోతున్నారని, ఆన్లైన్ విద్య కేవలం తెలుగు మీడియం విద్యార్థులకు పరిమితమవుతుందని వాపోయారు. అదేవిధంగా సందేహ నివృత్తి సాధ్యం అయ్యే విధంగా లేదు అని ముఖ్యంగా కరెంటు సమస్య ఉన్నదని, అదేవిధంగా 70% తల్లిదండ్రులు ఆఫ్ లైన్ విద్యకు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు గురించి ఆలోచించి ఆన్లైన్ విద్యను విద్యార్థులకు అందించాలని ఈ సందర్భంగా అన్నారు. అదేవిధంగా సగానికి పైగా విద్యార్థులు ఫోన్ లో వాడటం వల్ల తమ కంటి చూపు మందగిస్తుందని అన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు హర్షవర్ధన్, భాస్కర్ మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.