కరోన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 16, 2020

కరోన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి..


గజ్వేల్: సెప్టెంబర్ 15 (శుభ తెలంగాణ) మండల కేంద్రంలో జగదేవపూర్ పోలీస్ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సిద్ధిపేట కమిషనర్ రెట్ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య రథం ద్వారా డిస్ప్లే స్క్రీన్ పై వీడియో ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కరోనాపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మరియు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వివరించడం జరిగింది. అలాగే సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ కెనాల్స్ లలో ఈతకు వెళ్ళకూడదు వెళ్లినట్లు అయితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి. అన్ని వివరించి చెప్పడం జరగింది. ఈ కార్యక్రమం లో గ్రామ అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్, మండల వార్డ్ మెంబర్ల ఫోరం అధ్యక్షుడు బుద్ధచిన్నసత్యం వార్డ్ సభ్యులు మహేష్, వెంకటేష్ పోలీస్ బృందం మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.