ఎమ్మెల్యే సీతక్క అరెస్టు ఖండించిన... మండల కాంగ్రెస్ నాయకులు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, September 19, 2020

ఎమ్మెల్యే సీతక్క అరెస్టు ఖండించిన... మండల కాంగ్రెస్ నాయకులు

 


 గజ్వేల్: సెప్టెంబర్ 18 (శుభతెలంగాణ): రైతుల సమస్యలను పరిష్కరించా లని కోరితే ఎమ్మెల్యే సీతక్క అరెస్టు చేయడాన్ని జగదేవ పూర్ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపిటీసిలు మహేష్, మహేం దర్ రెడ్డి, నాయకులు మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాము,లు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం కిసాన్ కాంగ్రెస్ అధ్వర్యంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరిం చాలని కోరుతున్న క్రమంలో పోలీసులు ఎమ్మెల్యే సీతక్కను, కిసాన్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.