తెలంగాణ ఉద్యమ విద్యార్థి అమర వీరుడు.. కృష్ణకాంత్ కు నివాళులు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 08, 2020

తెలంగాణ ఉద్యమ విద్యార్థి అమర వీరుడు.. కృష్ణకాంత్ కు నివాళులు


ఆదిలాబాద్: సెప్టెంబర్ 7 (శుభ తెలంగాణ) : సోమవారం బేగంపేట, రసూల్ పుర, 2 వ నంబర్ వార్డ్ లో జరిగిన, తెలంగాణ ఉద్యమ విద్యార్థి అమర వీరుడు కట్టెలమండి కృష్ణ కాంత్ 7వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శ్రీ. అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి , కృష్ణ కాంత్ విగ్రహానికి పూలమాల వేసి జోహార్ నినాదాలు చేస్తూ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ కాంత్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. బి. టెక్ చదువుతూ, ఉజ్వల భవిష్యత్ కలిగి ఉన్న కృష్ణకాంత్ తెలంగాణ ఉద్యమ సమయంలో, తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలర్పించడం చాలా బాధాకరం, తను లేని లోటు కుటుంబానికి తీర్చలేనిది అని, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు. వారి తల్లిదండ్రులను శాలువా కప్పి సన్మానించారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలను ముఖ్యమంత్రి కెసిఆర్ నెరవేరుస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ కాంత్ తల్లితండ్రులు ధనరాజ్ మరియు సోదరుడు చంద్ర కాంత్, బోయినపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ టీ. ఎస్. శ్రీధర్ శ్రీనివాస్, 2వ వార్డు కంటోన్మెంట్ బోర్డు మెంబర్ సదా కేశవ రెడ్డి, రాష్ట్ర తెరాస సోషల్ మీడియా కోఆర్డినేటర్ క్రిశాంక్, రాష్ట్ర టి ఆర్ సి వి నాయకులు రాజ్ కుమార్, శ్రీనివాస్, అశోక్ మరియు తెరాస కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.