మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కన్నుమూత - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 01, 2020

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కన్నుమూత


రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఓ అద్భుత రాజకీయనేత విశ్రమించారు. అటు పాత తరానికి..ఇటు కొత్త తరానికి రాజకీయాల్లో వారధిగా నిలిచిన ప్రణబ్ ముఖర్జీ కన్నుమూ శారు. పివి శతజయంతి వేడుక లు జరుపుకుంటున్న వేళ మాజీ రాష్ట్రపతి కన్ను మూయడం విషా దకరం. పివి ప్రధాని కావడంతో తిరిగి కేంద్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ప్రణబ్ కాంగ్రెస్ రాజకీయాల్లో ట్రబుల్ షూటగా పేరుగడించారు. దేశంలో మేరు నగధీరుడిగా పేరు గడించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూయడంతో ఓ తరం అంతరించి పోయింది. ఆయన మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రాజనాథ్ సింగ్, సిఎం కెసిఆర్, సిఎం జగన్, మాజీ సిఎం చంద్రబాబు తదితర రాజకీయనేతలు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి భారత్ కు తీరని లోటని అన్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం చనిపోయారు. ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. వైద్యుల ప్రయత్నాలు, ప్రజల ప్రార్ధనలు ఫలించలేదని, తన తండ్రి కొద్ది సేపటి కిందటే చనిపోయిన సంగతి పేర్కొనడం చాలా బాధగా ఉందన్నారు. 84 ఏండ్ల ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 10న ఢిల్లీలోని ఆర్మీ దవాఖానలో చేరారు. అక్కడ పరీక్షించగా ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మెదడులో రక్తం గడ్డకట్టంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దీనికి తోడు ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ కారణంగా ఆయన కోమాలో ఉ న్నారని గత కొన్ని రోజులుగా వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ సపోర్టుతో ఉన్న ప్రణబ్ ఆరోగ్యం మరింత విషమించినట్లు సోమవారం ఉదయం ఆందోళన వ్యక్తం చేశారు. 2012 నుంచి 2017 వరకు భారత 13వ రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీకి 50 ఏండ్ల రాజకీయ అనుభవం ఉ న్నది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన ఆయన 2004-06లో రక్షణ మంత్రిగా, 2006-09లో విదేశాంగ శాఖ మంత్రిగా, 2009-12లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 2008లో పద్మభూషణ్, 2019లో దేశ అత్యధిక పౌర పురస్కారమైన భారత రత్నను ప్రణబ్ ముఖర్జీ పొందారు. ఆయనకు కుమార్తె షర్మిష్ణా ముఖర్జీ, కుమారులు అభిజిత్ ముఖర్జీ, ఇంద్రజిత్ | ముఖర్జీ ఉన్నారు. ప్రణబ్ ముఖ ర్జీ మరణంతో భారత్ లో ఓశకం ముగిసింది. కాంగ్రెస్ రాజకీయా ల్లో పివి తరవాత అంతటి మేధావిగా పేరు పొందారు. నిజానికి మన్మోమన్ స్థానంలో ఆయన ప్రధాని కావాల్సి ఉన్నా ఆయనను దూరం పెట్టారు. నిక్కచ్చి రాజకయీ నేత కావడం వల్లనే ఆయన ప్రధాని పదవికి దూరంకావాల్సి వచ్చిందని ఆయ నను దగ్గరగా చూసిన వారు వ్యాఖ్యానించే వారు. ఆ పార్టీ సీనియర్ నేత, మూడు తరాల నాయకులకు నమ్మకమైన వ్యక్తి గా సేవలు అందించిన ప్రణబ్ ముఖర్జీ మృతిచెందడం ఓ రకంగా కాంగ్రెస్ పార్టీకి కూడా తీరని లోటు. నిజ జీవితంలో, రాజకీయాల్లోనూ అజాతశత్రుగా కీర్తిగడించి ప్రణబ్ కేంద్రమంత్రి గా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవ చేశారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకే కాకుండా యావత్ దేశానికి తీరనిలోటు. ఇటీవల బ్రెయిన్ క్లాట్ కోసం సర్జరీ చేయించుకున్న ప్రణబ్ ముఖర్జీకు ఆపరేషన్ సమయంలో కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో దాదాపు 20రోజుల పాటు మృత్యువుతో పోరాడి సోమవారం తుదిశ్వాస విడిచారు. - సుదీర్ఘ రాజకీయ జీవితం 1935 డిసెంబర్ 11న అవిభక్త బెంగాల్ లో జన్మించిన ప్రణబ్ ముఖర్జీ జన్మస్థలం ప్రస్తుత బంగ్లాలో ఉంది. ఎమ్ఏ, న్యాయవాద విద్యలనూ అభ్యసించి పట్టా అందుకున్నారు అనంతరం కొంతకాలంపాటు లెక్చరర్ గా పనిచేశారు. తొలినుంచి సామాజిక దృక్పథం కలిగిన ప్రణబ్.. పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో 1969లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలిసారి 1969 కోల్ కత్తాలోని మిడ్నాపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించించారు. వెంటనే ప్రణబ్ ను కాంగ్రెస్ పార్టీ తన అక్కున చేర్చుకుంది. అనంతరం 34 ఏళ్లకే కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1973లో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఎంపికై నాటి ప్రధాని ఇందిరాగాంధీకి నమ్మినబంటుగా పేరుబడ్డారు. ఈ క్రమంలోనే వరుసగా 1975, 1981, 1993, 1999లో వరుసగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు ఇదిరా గాంధీ మరణం అనంతరం రాజీవ్ కు అండగా నిలబడి.. కాంగ్రెసు పెద్దదిక్కుగా ఉన్నారు. పీవీ నరసింహారావు హాయంలో 1991లో ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్ గా నియమితులైయ్యారు. 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా ఎన్నిక కావడంలో కీలకపాత్ర పోషించారు. 2004లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ప్రణబ్ ఆర్ఎస్ఎస్ సభలకు హాజరు కావడం అప్పట్లో విమర్శలకు దారితీసింది. యూపీయే ప్రభుత్వంలో 2004 నుంచి 2012 వరకు కీలకమైన రక్షణ, విదేశాంగ, ఆర్థిక, వాణిజ్య శాఖలు సమర్థవంతగా నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ప్రణబ్ ను గుర్తింపు పొందారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2008లో పద్మ విభూషణ్, 2019లో భారతరత్న అవార్డుతో సత్కరించింది. బీజేపీ ప్రభుత్వం ఆయనకు అత్యున్నత భారతరత్న అవార్డును ప్రకటించడం గమనార్హం. 2012లో దేశ 13వ రాష్ట్రపతిగా ఎన్నికయిన ప్రణబ్ ముఖర్జీ 2018లో ఆరెస్సెస్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు సమావేశానికి హాజరైన తొలి మాజీ రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు. అంతేకాకుండా అజాతశత్రుగా పిలువబడ్డారు. రాజీవ్ హయాంలో 1984లో కాంగ్రెస్ ప్రణబ్ గుడ్ బై చెప్పారు. రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్ పేరుతో 1984లో ప్రణబ్ సొంత పార్టీ స్థాపించారు. 1991లో రాజీవ్ హత్య తర్వాత పివి తిరిగి ఆయనను కాంగ్రెస్లోకి రప్పించారు.