పేద ప్రజల కోసం పెట్టిన.. డబుల్ బెడ్ రూమ్ స్కీం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, September 11, 2020

పేద ప్రజల కోసం పెట్టిన.. డబుల్ బెడ్ రూమ్ స్కీం..


సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 10 (శుభ తెలంగాణ) : రామచంద్రపురం 112 డివిషన్లో ఉన్న 112 డివిజన్ కార్యాలయంలో తెరాస ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకంగా పట్టుపట్టి పేద ప్రజల కోసం పెట్టిన డబుల్ బెడ్ రూమ్ స్కీం ను గురువారం 112 డివిజన్ కార్పొరేటర్ తొంట అంజయ్య ముఖ్య అతిధిగా విచ్చేసి డిప్యూటీ కమీషనర్ బాలయ్య తో కలిసి స్కీం ను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి పేద ప్రజల కొరకు ఈ స్కీం చాల బ్రహ్మాండమయినది అని కార్పొరేటర్ గారు తెలిపారు. పేద ప్రజల పక్క ఇల్లు ఆకాంక్ష తీరబోతుంది అని కార్పొరేటర్ తెలిపారు. అనంతరం ఓల్డ్ రామచంద్ర పురంలో ఉన్న మహిళా మండల్ బిల్డింగ్లో,కనుకుంటా లో ఉన్న ప్రైమరీ స్కూల్ లో జరుగుతున్న స్కీం ను పరిశీలించిన కార్పొరేటర్ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గురువారం నుంచి ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు అని కార్పొరేటర్ గారు తెలిపారు. వారితో జీహెచ్ఎంసి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.