కొత్త రెవెన్యూ చట్టం ఒక సువర్ణాద్యయం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, September 10, 2020

కొత్త రెవెన్యూ చట్టం ఒక సువర్ణాద్యయం..


కూకట్‌పల్లి సెప్టెంబర్ 9(శుభ తెలంగాణ); తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం కొత్త రెవిన్యూ చట్టాన్ని సమర్థిస్తూ కే పి హెచ్ బి టెంపుల్ బస్టాండ్ దగ్గర 114 డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇంచార్జి అడుసుమిల్లి వెంకటేశ్వరరావు , డివిజన్ పార్టీ అధ్యక్షుడు సాయిబాబా చౌదరి మరియు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ తీసుకున్న ఈ చట్టాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇది ఒక సువర్ణాద్యయమని ఈ చట్టంద్వారా పేదల భూములు దూరగతం కాకుండా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కె సాధ్యం అని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు పవన్, హరిబాబు, భవాని, హనుమంతరావు,వెంకట రమణ, శ్యామల రాజు, నరాయణరాజు,వాసు నాయుడు, ప్రతాప్,గఫోర్, నరసింహ, భాస్కర్నాయి, పున్నారవు, వేణుగోపాల్, రాము, శరత్, శ్రీను, భారతి, బేగం, రామా దేవి,అనురాధ, లీల,పద్మ, శ్రేదేవి, సుబ్బలక్ష్మీ, వరలక్ష్మి, లక్ష్మీ రాజు తదితరులు పాల్గొన్నారు.