దేశంలో ఆగని కరోనా విజృంభణ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, September 05, 2020

దేశంలో ఆగని కరోనా విజృంభణ


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4 : దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురు తున్నది. దేశవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా రెండో రోజూ 80 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 39 లక్షలు దాటాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 83,341 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 39,36,748కు చేరింది. ఇందులో 8,31, 124 కేసులు యాక్టివ్ గా ఉండగా, మరో 30,37,152 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. కరోనా బారినపడినవారిలో మరో 1096 మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు కరోనామృతుల సంఖ్య 68,472కు చేరింది. దేశంలో కరోనాతో ఇంత పెద్ద సంఖ్యలో మరణించడం ఇదే మొదటి సారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా నిన్న 11,69,765 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రకటించింది. దీంతో సెప్టెంబర్ 3 వరకు మొత్తం 4, 66, 79, 145 నమూనాలను పరీక్షించామని తెలిపింది. మొత్తంగా భారత్ లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడం లేదు. తొలుత కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న స్పెయిన్, అమెరికా, బ్రెజిల్ లో కరోనా ప్రభావం రానురాను తగ్గిపోగా భారత్ లో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. భారత్ లో గడచిన 24 గంటల్లో 83,341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39 లక్షలు దాటింది. - తెలంగాణలో కొత్తగా 2,478 పాజిటివ్ కేసులు... తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగు తోంది. గడిచిన 24 గంటల్లో 2,478 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,35,884కు చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తగా 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 866కు చేరింది. గురువారం ఒక్కరోజే 2,011 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలు కున్నవారి మొత్తం సంఖ్య 1,02,024. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32,994. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.14 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 75.00 శాతంగా ఉంది. భారత్ లో మరణాల రేటు 1.74 శాతంగా ఉండగా.. తెలంగాణలో ). 63 శాతంగా ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 62,543 పరీక్షలు నిర్వహిం చామని మొత్తం పరీక్షల 16,05,521కు చేరిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.