ఆరికఆకులతో ప్లేట్ల తయారీ... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, September 04, 2020

ఆరికఆకులతో ప్లేట్ల తయారీ...


సిద్ధిపేట జిల్లా: సెప్టెంబర్ 8 (శుభ తెలంగాణా) : ప్లాస్టిక్ ప్లేట్లకు ప్రత్యామ్నాయంగా ఆరిక ఆకులతో ప్లేట్లు తయారు చేసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు మన్ననలు పొందారు పట్టణానికి చెందిన ఓయువకుడు. సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో బుధవారం మధ్యా హ్నం సిద్ధిపేటలో తొలిసారి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం గా ఆరిక ఆకులతో తయారు చేసిన ప్లేట్లను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించి ప్రమోద్ ను అభినందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే... సిద్ధిపేట పట్టణానికి చెందిన ప్రమోద్ యాదవ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించేలా ఎకో ఫ్రెండ్లీ వస్తువులను తయారు చేసి వాడాలని ప్రజలను ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఇందుకు అనుగుణంగా ప్రమోద్ యాదవ్ ప్లాస్టిక్ సమస్యకు పరిష్కారంగా ఆరిక ఆకులతో టెక్నాలజీని రూపొందించి అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రత్యేకించి ఆరిక ఆకులతో కప్పులు, ప్లేట్లు, స్పూన్లను కూడా తయారు చేయవచ్చునని నిరూపించారు.