ఎమ్మెల్యే అంబులెన్సులు ప్రారంభం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, September 13, 2020

ఎమ్మెల్యే అంబులెన్సులు ప్రారంభం


హైదరాబాద్, సెప్టెంబర్ 12(శుభ తెలంగాణ): రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో ప్రభుత్వానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంబులెన్స్ ను అందజేస్తున్న విష యం తెలిసిందే. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెండు అంబులెన్స్ ను సమకూర్చారు. నగరంలోని బుద్ధ భవన్ ఆవరణలో ఈ రెండు అంబులెన్స్ ను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.