నేతన్నల కుటుంబాల న్యాయమైన డిమాండ్లను.. ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, September 10, 2020

నేతన్నల కుటుంబాల న్యాయమైన డిమాండ్లను.. ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి


సిద్ధిపేట జిల్లా: సెప్టెంబర్ 9 (శుభ తెలంగాణ) : సిరిసిల్ల తరహాలో దుబ్బాకలో టెక్నైల్ పార్క్ పార్కు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించాలన్నారు. చేనేత కార్మికులకు ఎన్నికలలో ఇచ్చిన హామీల ను వెంటనే నెరవేర్చాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో చేనేత కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష మొదటి రోజు కార్య క్రమంలో పాల్గొని నేతన్నలకు సంఘీభావం తెలిపారు రైతులకు అందిస్తున్న టువంటి రైతు బీమా మాదిరిగానే ప్రతి చేనేత కార్మికునికి ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలన్నారు పక్క రాష్ట్రంలో అమలు చేస్తున్న చేనేత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి వ్యాపార అభివృద్ధి కోసం వ్యక్తిగత రుణాలను ఎటువంటి షరతులు లేకుండా మంజూరు చేయాలన్నారు. నేతన్నల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిం చకపోతే రిలే నిరాహార దీక్షను ఆమరణ నిరాహార దీక్ష గా కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.