తెలంగాణ విమోచన దినోత్సవాన్ని.. అధికారికంగా నిర్వహించాలి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, September 18, 2020

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని.. అధికారికంగా నిర్వహించాలి  హైదరాబాద్ సెప్టెంబర్ 17 (శుభ తెలంగాణ) : ఉప్పల్ లో లోక్ జనశక్తి పార్టీ ఆఫీసులో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ పాశం మాధవరావు పటేల్ పాల్గొనడం జరిగిం ది. ఈ సమావేశానికి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, న్యూ ఇండియా పార్టీ ఉపాధ్యక్షులు మారబోయిన నర్సయ్య ,లంబాడి హక్కుల మహిళ నాయకురాలు వినోద,రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మాధవరావు పటేల్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు విముక్తి అయినా సెప్టెంబర్ 17 దినాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార పూర్వకంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పాల్గొన్న వ్యక్తులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజాం నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛా వాయువులు తీసుకుంటున్నట్లు తెలంగాణ ప్రజలు అందరు కూడా సెప్టెంబర్ 17 దినాన్ని తెలంగాణ విమోచన దినం పాటించాలని ఈ సందర్భంగా వారు అభిప్రాయ పడ్డారు. ఎందరో పోరాట యోధుల ఫలితమే ఈ తెలంగాణ విమోచన దినం గా పరిగణిస్తూ రాష్ట్ర ప్రజలు అందరూ ఈ రోజును విమోచన దినంగా జరుపుకోవాలని వక్తలు కోరారు.