బస్తీ దవాఖానలతో పేదలకు.. చేరువగా మెరుగైన వైద్యం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, September 12, 2020

బస్తీ దవాఖానలతో పేదలకు.. చేరువగా మెరుగైన వైద్యం..


కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 11(శుభ తెలంగాణ) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని రంగారెడ్డి నగర్ లో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను శుక్రవారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మరియు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ విజయ్ శేఖర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం మారుతి నగర్ లో రూ.17.50 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న అంతర్గత సిసి రోడ్డు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు మెరు గైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం పని చేస్తోందని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే ఎందరికో బస్తీ దవాఖానల ఏర్పాటుతో స్థానికంగానే వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో జిహెచ్ఎంసి పరిధిలో బస్తీ దవాఖానలను పెంచామని, పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ఇటు అభివృద్ధిలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక వసతులకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి నిర్మల, డిప్యూటీ కమిషనర్ మంగతాయారు, స్థానిక వార్డు సభ్యులు భాస్కర్ రెడ్డి, జ్యోతి, ఖాదర్, లక్ష్మణ్ మరియు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శంకరయ్య, జయీలక్ష్మీ నాథ్, సుధాకర్, శ్రీనివాస్, గణేష్, సతీష్ రెడ్డి, కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు గౌసుద్దిన్, జెనరల్ సెక్రెటరీలు కార్తిక్ గౌడ్, అంజి ముదిరాజ్, ఏర్వ సాయి కుమార్, బాలు నేత తదితరులు పాల్గొన్నారు.