ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 15, 2020

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్


భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో. సెప్టెంబర్ 14. (శుభ తెలంగాణ : జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రానున్న నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉ ందన్నారు. తుఫాన్ ఉత్తర కోస్తాంధ్ర సమీపానికి చేరిందని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయిన ఈ అల్పపీడనం మరింత బలపడి రానున్న నాలుగు రోజులపాటు పశ్చిమ వాయవ్యంగా పయనించవచ్చని వాతావరణ శాఖ సూచించినట్లు చెప్పారు. దీని ప్రభావంతో మంగళవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, 40 - 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశాలున్నాయన్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉ ండాలని, చేపల వేటకు వెళోద్దని తెలిపారు. శిథిలావస్థకు చేరిన భవనాలు, పెద్ద చెట్లు, వంగిన, లూజుగా విద్యుత్తు తీగలవల్ల ప్రమాదం పొంచి ఉందని, ప్రజలు అంత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదేని సమస్య ఏర్పడితే అయితే సంబంధిత అధికారుల దృష్టికి తేవాలని, అధికారులు తక్షణం పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉ ండాలని ఆదేశించారు.