వెబ్ నాలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, September 17, 2020

వెబ్ నాలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం..


హైదరాబాద్ సెప్టెంబర్ 16 (శుభ తెలంగాణ) : తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం 16-9-2020 మంగళవారం రాత్రి 8గంటలకు వెబ్ నాలో నిర్వహించడం జరిగింది. లాక్ డౌన్ మరియు కరోన మహమ్మారి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యం లో వెబ్ నార్ ద్వారా సమీక్ష నిర్వహించాలని రాష్ట్ర అధ్యకుడి ప్రకటనతో రాష్ట్ర కమిటీ మెంబర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పాలడుగుల కనకయ్య అధ్యక్షతన జరిగిన. ఈ సమావేశంలో ఇప్పటి వరకు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి చేసిన కార్యక్రమాల గురించి ఒక్కొక్క సభ్యులు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉ పాధ్యక్షులు ఆత్కూరి సంజీవ్ రాజ్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ సాధన అనేది ఇప్పుడు మన ముందు ఉన్న లక్ష్యమని ఇందుకోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని వారన్నారు.