అక్రమ ఇసుక రవాణాపై.. చర్యలు తీసుకోవాలని వినతి పత్రం... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, September 12, 2020

అక్రమ ఇసుక రవాణాపై.. చర్యలు తీసుకోవాలని వినతి పత్రం...


సిద్ధిపేట జిల్లా సెప్టెంబర్ 11 (శు భ తెలంగాణ) : కోహెడ మండలం తంగాళ్ళపల్లి గ్రామంలో ని మొయతుమ్మద వాగు లో నుంచి రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గృహ నిర్మాణాలకు మరియు రైతు కల్లాలకు షెడ్లకు వివిధ కట్టడాలకు అవసరమైన ఇసుకకు ఎలాంటి ఆంక్షలు లేకుండా చేసి ఉదయం 6:00 నుంచి 10:00 గంటల లోపు తెచ్చుకోవడానికి అవకాశం కల్పించాలని, ప్రభుత్వ బంచరాయి భూమి గ్రామ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సర్వే చేయించి హద్దులు నిర్ణయించగలరని స్థానిక తహసీల్దార్ రుక్మిణి కి మరియు మండల ఎస్ ఐ రాజ్ కుమార్ లకి, ఎంపీటీసీ కోనె శేఖర్,వార్డు సభ్యులు చామంతుల తిరుపతి,ఎఎంసి డైరెక్టర్ పిల్లి సంపత్ కుమార్, గ్రామస్తుల తో వెళ్లి వినతి పత్రం అందజేశారు. వారితో పాటు వేణుగోపాల స్వామి దేవస్థానం కమిటీ డైరెక్టర్ చుంచు సుమన్,బీజేపీ నాయకులు శ్రీరాముల అనిల్,ఎగుర్ల ఐలేష్,గడ్డం వెంకటేష్, ముత్త శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.