పోలీసులకు చిక్కిన మావోయిస్టు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 09, 2020

పోలీసులకు చిక్కిన మావోయిస్టు


భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, సెప్టెంబర్ 8 (శుభ తెలంగాణ) : నిషేదిత సిపిఐ మావోయిస్టు రెండు రోజుల క్రితం బంద్ పేరుతో తెలంగాణ స్టేట్ కమిటీ మావోయిస్టు పార్టీ సాయుధ అజ్ఞాత దళాలు రక్షణ బలగాల పై, ప్రజాప్రతినిధులపై ఆకస్మిక దాడులు చేయడానికి పథకం పన్నారన్నార ని భద్రాచలం ఏఎపి రాజేష్ చంద్ర తెలిపారు. ఏఎస్ పి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంద్ పిలుపులో భాగంగా ఆదివారం రాత్రి సుమారు 9.30 గంటల సమయం లో పెద్ద మిడిసిలేరు శివారు నుండి తాలిపేరు డామ్ వైపు వెళ్ళు ఆర్ బి, బిటి రోడ్ పగిడివాగు దాటిన తరువాత ప్రేలుడు పదార్ధములు,మందు పాత్రలు పెట్టి పేల్చి వేసి ప్రభుత్వ మరియు ప్రజల ఆస్తులకు నష్టము కలిగించారని, నిషేదిత మావోయిస్ట్ ల ఆగడాల ను అరికట్టడానికి మరియు తదుపరి నేరములు నివారించటానికి, సోమవారం చర్ల ఎస్ఇ రాజు వర్మ, ఆధ్వర్యంలో జిల్లా స్పెషల్ పార్టీ మరియు సిఆర్ పిఎఫ్ బలగాలను కూంబింగ్ ఆపరేషన్ గురించి పెద్ద మిడిసిలేరు అటవీ ప్రాంతానికి పంప డం జరిగిందని ఆయన తెలిపారు. పోలీసు సిబ్బంది కూంబింగ్ నిర్వహించు చుండగా, సాయంత్రం సుమారు 4.30 గంటల సమయం లో ఐదుగురు వ్యక్తులు పెద్ద మిడిసిలేరు అటవీ ప్రాంతం లో అనుమానాస్పదం గా సంచరించుచు పోలీసు వారు రావటం చూచి అక్కడి నుండి పారిపోయినారని, ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగిందన్నారు, అతను మడివి రాజు, తండ్రి కోసయ్య, 20 సం., గొత్తి కోయ, మల్లేరు గ్రామం, దంతెవాడ జిల్లా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర వ్యక్తి గా గుర్తించడం జరిగిందన్నారు. ఇతను నిషేదిత సిపిఐ మావోయిస్ట్ రెండవ సిఆర్ సి దళం మెంబర్ గా పనిచేస్తున్నాడని, తెలంగాణ స్టేట్ కమిటీ మావోయిస్టు పార్టీ ఆదేశాల ప్రకారం పోలీసు వారిని చంపటానికి, ప్రభుత్వ ఆస్తులని ద్వంశం చేయటానికి మందు పాత్రలు పెట్టటానికి వచ్చామని తెలిపాడని, ఇతను పెద్ద మిడిసిలెరు వద్ద రోడ్ బ్లాస్టింగ్ సంఘట నలో ఇతను పాల్గొనడం జరిగిందని, ఇతని వద్ద నుండి జీలేటిన్ స్టిక్స్ 20, డిటోనేటర్స్ 10,మావో యిస్ట్ కరపత్రాలు 5 స్వాధీన పరచుకొనైనదనీ, చట్ట వ్యతిరేక పనులు చేసే వారిని ఎవరిని వదిలిపెట్ట బోమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.