శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, September 17, 2020

శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్ట్


హైదరాబాద్, సెప్టెంబర్ 16(శుభ తెలంగాణ): టీవీ నటి కొండపల్లి శ్రావణి మృతి కేసు లో పోలీసులు టిస్ట్ ఇచ్చారు. రిమాండ్ రిపోర్టులో ఏ1 గా దేవరాజ్ రెడ్డి, ఏ 2 గా సాయి కృష్ణా రెడ్డి, ఏ 3గా అశోక్ రెడ్డిని చేర్చారు. అయితే, ఆదివారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమా వేశంలో ఏ3 గా దేవరాజ్ పేరును వెల్లడించిన పోలీసులు తాజాగా అతన్ని ఏ1 గా పేర్కొన్నారు. ఇక ఈ కేసులో 17 మంది సాక్షులను విచారించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. నిందితులు దేవరాజ్ రెడ్డి, సాయి కృష్ణా రెడ్డిలు విచారణలో కీలక విషయాలు చెప్పిట్టు తెలిసింది. దేవ్ రాజ్ ని ప్రేమించిన శ్రావణి ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. అదే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు దేవరాజ్ ని అడగడంతో అతను ఒప్పుకోలేదు. శ్రావణి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ, సాయి కృష్ణా రెడ్డి, అశోక్ రెడ్డిలతో శ్రావణికి రిలేషన్ ఉండటంతో దేవ్ రాజ్ ఒప్పుకోలేదు. దేవరాజ్ ని కలవడానికి శ్రావణి మెసెజ్ లు, ఫోన్ కాల్స్ ప్రయత్నించింది. సాయి కృష్ణ, అశోక్ రెడ్డి, శ్రావణి కుటుంబ సభ్యులు శ్రావణిని బెదిరించారు. సెప్టెంబర్ 7న అజీజ్ నగర్ షూటింగ్ లొకేషన్ నుంచి దేవరాజ్ శ్రావణిని తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి పంజాగుట్ట శ్రీకన్య హోటల్ కి వెళ్లారు. రాత్రి 9.30 గంటలకు చేరుకున్నారు. అదే సమయంలో శ్రీకన్య హోటల్ కు చేరుకున్న సాయికృష్ణ శ్రావణిని కొట్టి ఆటోలో తీసుళ్లాడు. దేవ్ రాజ్ ని కలవకూడదని సాయి కృష్ణా, అశోక్ రెడ్డి శ్రావణిని బెదిరించారు. దేవ్ రాజ్ ను చంపేసి, ఆర్థికంగా ఆదుకోమని బెరింపులకు దిగారు. దీంతో హైదరాబాద్ వదిలి వెళ్లిపోదామని శ్రావణి దేవరాజ్ ను కోరింది. శ్రావణి శ్రావణి తో పారిపోయి పెళ్లి చేసుకోవడానికి దేవ్ రాజ్ ఒప్పుకోలేదు. సాయికృష్ణా, అశోక్ రెడ్డిల వేదింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. ఏ 3 అశోక్ రెడ్డి పరారీలో ఉన్నాడు. సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశచూపి అశోక్ రెడ్డి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దేవరాజ్ కు శ్రావణి దగ్గర కావటడం జీర్ణించుకోలేని అశోక్ రెడ్డి సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం,

Post Top Ad