ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, September 11, 2020

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి..


చర్ల సెప్టెంబర్ 10(శుభ తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 35వ వర్ధంతిని చర్ల మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. భూమికోసం భుక్తి కోసం తెలంగాణ పీడిత ప్రజల వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో పాల్గొని తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచా నికి చాటి చెప్పిన రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదామని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొని బిజెపి మండల అధ్యక్షుడు గూనూరి, రమణ మాట్లాడుతూ తొలి దశ ఉద్యమ కాలంలోనే రైతుకూలీలు, నిరుపేద రైతుల పక్షాన పోరాడిన ఐలమ్మ 10 లక్షల మందికి పైగా పేదలకు సాగు భూమిని పంచారని ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ మహిళా సాధికారతను అప్పుడే నిరూపించారని తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధికార ప్రతినిధి సంతపూరి సురేష్, రేగళ్ల రమణ, టిఆర్ఎస్ పార్టీ మండల బిసి సెల్ అధ్యక్షుడు దొడ్డి సూరిబాబు, చింతూరి వినోద్, టిడిపి నాయకులు సుధాకర్, ముదిగొండ కుమారి, ఎడారి నాగరత్నం, వరలక్ష్మి, సావిత్రి, సక్కుబాయిలు పాల్గొన్నారు.