కార్మికుల సమస్యలపై వినతి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 16, 2020

కార్మికుల సమస్యలపై వినతి


మణుగూరు. సెప్టెంబర్ 17. (శుభ తెలంగాణ). కేంద్ర సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం, బిఎం ఎస్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం మణుగూరు ఎఓ టు జిఎం. బోగ వెంకటేశ్వర్లు ద్వార సింగరేణి చైర్మెన్ కు పలు డిమాండ్ లతో కూడిన అంశాలపై వినతిపత్రం ఇవ్వడం జరుగిందని బి ఎం ఎస్ కేంద్ర కమిటీ నాయకులు వీరమనేని రవీందర్రావు తెలిపారు. జీఎంకు ఇచ్చిన వినతి పత్రంలో మార్చి నెలలో కట్ చేసిన 50 శాతం వేతనాలను వెంటనే చెల్లించాలని, 2019-20 లాభాలను ప్రకటించి కార్మికులకు 35 శాతం లాభాల వాటాను ఇవ్వాలన్నారు. మెడికల్ బోర్డ్ ను వెంటనే ఏర్పాటు చేసి కార్మికులకు న్యాయం చేయాలని, సింగరేణి లో పని చేసే వైద్య సిబ్బంది అందరికి 10% ఇన్సెంటివ్ ఇవ్వాలన్నారు. కోవిడ్ సోకిన కార్మికులకు స్పెషల్ అలవెన్సు చెల్లించాలనే తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్యదర్శి ముక్క సుధాకర్, ఏరియా కన్వినర్ పైడిపాల మల్లేశము,జిల్లా బిఎంఎస్ కోశాధికారి శివరావు, దాసరి సీత, రామకృష్ణ, నర్సింగ రావు, కుమార స్వామి తదితరులు పాల్గొని మెమోరాండం ఇవ్వడం జరిగింది.