అక్రమంగా తరలిస్తున్న.. రేషన్ బియ్యం పట్టివేత.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, September 03, 2020

అక్రమంగా తరలిస్తున్న.. రేషన్ బియ్యం పట్టివేత..


రాజన్న సిరిసిల్ల జిల్లా: సెప్టెంబర్ 2 (శుభ తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని జిల్లెల్ల గ్రామశివారు యందు రోడ్డు మార్గం గుండా అక్రమంగా ఆటోల్లో తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టు కున్నారు రాజన్న సిరిసిల్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు సమాచారం మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెర్టే ఉత్తర్వుల ప్రకారం టాస్క్ ఫోర్స్ సిబ్బంది బుధవారం రోజున జిల్లెల్ల గ్రామ శివారు యందు టీఎస్ 08యుడి 3658 గల వాహనం తనిఖీ చేయగా ప్రభుత్వ రేషన్ బియ్యం దొరికినవి అట్టి రేషన్ బియ్యం అందాజ 50క్వింటాళ్లు తగు చర్య నిమిత్తం డ్రైవరు రేగుల రాజును రేషన్ బియ్యంతో యుక్తంగా వాహనంను తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించనైనదనీ తెలిపినారు. ఇట్టి దాడిలో టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, కానిస్టేబుళ్లు రమేష్, తిరుపతి పాల్గొన్నారు.