కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 08, 2020

కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం..


కేశంపేట్ సెప్టెంబర్ 7(శుభ తెలంగాణ) కమిషనరేట్ నిర్వహణ లో చనిపోయిన కానిస్టేబుల్ ఎండీ. కుర్షీద్ ఖాన్ భార్య కైరున్నీసా బేగం కు సైబరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. కేశంపేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఎండీ. కుర్షీద్ ఖాన్ విధి నిర్వహణ నిమిత్తం మోటార్ సైకిల్ పై వెళ్తుండగా 2018 మార్చి 25వ తేదీన రోడ్డు షాద్ నగర్ లో ప్రమాదంలో మరణించారు. కాగా ప్రభుత్వం నుంచి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ద్వారా వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు 5 లక్షలు సోమవారం సీపీ అతని భార్య కైరున్నిసా బేగం కు అందజేశారు. కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నందుకు గాను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సనార్, ఐపీఎస్ కి పోలీస్ అధికారుల సంఘం తరపున ఆ సంఘం అధ్యక్షులు సి. హెచ్. భద్రా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ అధికారులు సంఘం అధ్యక్షుడు సీ. హెచ్ భద్రా రెడ్డి, సైబరాబాద్ పోలీస్ అధికారులు సంఘం కార్యదర్శి కృష్ణ రెడ్డి పాల్గొన్నారు.