పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని బిజెపి డిమాండ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 01, 2020

పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని బిజెపి డిమాండ్


గజ్వేల్ (శుభ తెలంగాణ) అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కిసాన్ మోర్చ పిలుపు మేరకు హైదరాబాద్ రైతు ధర్నాకు బయలుదేరిన గజ్వేల్ బిజెపి నాయకులు. నష్టపోయిన రైతుల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందడం జరిగింది. రైతు లేనిదే రాజ్యం లేదు అని చెప్పిన కేసీఆర్ ఈ రోజు రైతు ఆత్మహత్యలకు కారకులు అవుతున్నారు కాబట్టి రైతు రాజుగా నిలబడాలంటే ప్రభుత్వం తరఫున అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ప్రభుత్వ పాలన తీరు చూస్తుంటే రైతు సంక్షేమం కోసం ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేని పరిస్థితి లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గజ్వేల్ పట్టణంలో కావలసినంత మద్యం అందుబాటులో ఉన్నంతగా రైతులకు కావలసినటువంటి యూరియా ఎందుకు అందుబాటులో ఉంచడం లేదో ఈ ప్రభుత్వం రైతులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కురిక్యాల రాములు బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి తూం. శ్రీధర్ బిజెపి మండల నాయకులు గొడుగు కుమార్ ,బీనమైన ప్రభాకర్ , చందాస్వామి, వెంకట్రామ్ రెడ్డి, పపంగా నరసింహులు ,చిక్కుడు సాయి తదితరులు పాల్గొన్నారు.