కరోనా పీడ పోలే! - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 02, 2020

కరోనా పీడ పోలే!


జెనీవా, సెప్టెంబర్ 1: కరోనా వైరస్ నేపథ్యంలో చాలా వరకు స్తంభించిన పలు దేశాల ఆర్థిక వ్యవస్థ లు మళ్లీ గాడిలో పడుతు న్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఆర్థిక వ్యవస్థ పునర్ ప్రారంభాన్ని స్వాగతిస్తున్నామని, కానీ కరోనా మహమ్మారి వెళ్లిపోయినట్లు భావించ కూడదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. కరోనా వైరస్ ఆనవాళ్లు బయటపడి 8 నెలల అవుతున్నదని, ప్రజలు చాలా నీరసించి ఉంటారని తాము అర్థం చేసుకోగలమని, కానీ ఏఒక్క దేశంలో కూడా మహమ్మారి అంతం అయినట్లు భావించ కూడదని డబ్ల్యూ హెవో చీఫ్ టెడీస్ తెలిపారు. వైరస్ అత్యంత సులువుగా వ్యాప్తి చెందుతున్నదని, ప్రాణాలను కాపాడడంలో, వైరసను నియంత్రించడంలో మనం అందరం సీరియస్ గా ఉండాలన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందు కు సురక్షితమైన చర్యలు అమలు చేయాలని అన్ని దేశాలను డబ్ల్యూహెక్టా కోరింది. బహిరంగ కూడికలను నియంత్రిం చాలన్నది. ఎక్కువగా వైరస్ బారినపడే అవకాశం ఉ న్న వారిని రక్షించే చర్యలు చేపట్టాలన్నది. వైరసన్ను ప్రపంచదేశాలు ఎంత నియంత్రిస్తే, ఆయా దేశాలు తమ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు అని టెడ్డీస్ పేర్కొన్నారు. ఎటువంటి నియంత్రణ లేకుండా ఆర్థిక వ్యవస్థలను ఓపెన్ చేయడం ప్రమాదానికి దారి తీస్తుందన్నారు. వైరస్ కాలం గడిచి పోయిందన్న భావనను ఈ దేశం కూడా చేయవద్దు అన్నారు.