ఖాకీ దుస్తులను చూసి... గర్వపడాలి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, September 05, 2020

ఖాకీ దుస్తులను చూసి... గర్వపడాలి


హైదరాబాద్, సెప్టెంబర్ 04(శుభ తెలంగాణ): ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి తప్ప అహంభావం ఉండకూడదని ప్రధాని మోదీ అన్నారు. కరోనా కట్టడిలో పోలీసులు ముందుండి పోరాడుతున్నారని కితాబిచ్చారు. హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఐపీఎస్ పాసింగ్ మాట్లాడారు. జాతీయ పోలీస్ అకాడమీలో శుక్రవారం 131 మంది ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ప్రొబేషనరీ ఐపీఎస్లను ఉ ద్దేశించి స్ఫూర్తిదాయక సందేశమిచ్చారు. యోగా, ప్రాణాయామం ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని అన్నారు. మీరు మీ గుండె నుంచి ఏ పని చేసినా.. దాని వల్ల మీరు లబ్ది పొందుతార న్నారు. ఎంత పని ఉన్నా.. మీరు వత్తిడికి లోనుకారని ప్రధాని తన సందేశంలో తెలిపారు. మనసులోనూ యోగా చేయడం చాలా మంచి పద్ధతని చెప్పారు. ప్రజా సేవలో ఉండే అధికారులు ఆరోగ్యంగా ఉ ండాలని ప్రధాని మోదీ తెలిపారు. పనిభారం, ఒత్తిడి ప్రభావం ఆరోగ్యంపై పడకుండా చిట్కాలు పాటించాలన్నారు. కరోనా సంకట పరిస్థితుల్లో పోలీసుల సేవలు ప్రశంసనీయం అని కితాబునిచ్చారు. కరోనా కట్టడిలో పోలీసులే ముందుండి పోరాడుతున్నారు. కరోనా వేళ మానవతా దృక్పథంతో సేవలందిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో పోలీసుల మానవీయ కోణం ప్రజలకు తెలిసింది. ఈ కష్టకాలంలో పోలీసుల పాత్రను చరిత్రలో లిఖించారు. కరోనా కట్టడిలో పోలీసులు ముందుండి పోరాడుతున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. కరోనా సంకట స్థితిలో పోలీసుల సేవలు ప్రశంసనీయమన్నారు. ఇండోర్ లో చాలా మంది పోలీసులు కరోనా బారిన పడ్డారని, ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఐపీఎస్ ప్రొబేషనర్ల ను గతంలో ఇంటికి ఆహ్వానించే వాడిని. కొవిడ్ కారణంగా ముఖా ముఖి కలుసుకోలేకపోతున్నా. త్వరలోనే మీతో సమావేశ మవుతా నని మోదీ అన్నారు. పనిచేసే చోట ఉపాధ్యాయులు, నిపుణులతో నెలకోసారైనా భేటీ కావాలన్నారు. ఈ ఏడాది 131 మంది ఐపీఎస్ అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 121 మంది 2018 బ్యాచ్ కు చెందినవారు కాగా.. మరో 10 మంది 2017 బ్యాచ్ కు చెందినవారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 28 మంది మహిళా ప్రొబేషనర్లు ఉ న్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 11 మందిని తెలంగాణకు, ఐదుగురిని ఏపీకి కేటాయించారు. పాసింగ్ ఔట్ పరేడకు తమిళనాడు కేడర్‌కు చెందిన కిరణ్ శృతి నాయకత్వం వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సహాయక మంత్రి కిషన్ రెడ్డి, జితేంద్రసింగ్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.