పోలీస్ కాల్పుల్లో మావోయిస్టు మృతి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, September 04, 2020

పోలీస్ కాల్పుల్లో మావోయిస్టు మృతి


భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో. సెప్టెంబర్ 3 (శుభ తెలంగాణ) : గత రెండు మూడు రోజులుగా గుండాల మండలం దేవలగూడెం మరియు దుబ్బగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళం మరియు యాక్షన్ టీంలు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఈ రెండు గ్రామాల సరిహద్దుల్లో ప్రతిరోజు గుండాల పోలీసులు మరియు స్పెషల్ పార్టీల ఆధ్వర్యంలో ఏరియా డామినేషన్ మరియు వాహన తనిఖీలు చేపట్టడం జరిగిందని జిల్లా ఎస్పీ సునీల్ దత్ పేర్కొన్నారు. అదేవిధంగా బుధవారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం ఉదయం 4.15 గంటల సమయంలో గుండాల సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుంటే బైకుపై ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా వారిని వెంబడించి, లొంగిపొమ్మని గట్టిగా కేకలు వేస్తుంటే అకస్మాత్తుగా వారు పోలీసులపై కాల్పులు జరిపారని. అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిపై తిరిగి కాల్పులు జరపడం జరిగిందని ఆయన తెలిపారు. కొద్ది సమయం తర్వాత కాల్పులు జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా సుమారుగా 25 సంవత్సరాలు కలిగిన ఒక గుర్తు తెలియని మావోయిస్టు మృతదేహం, ఒక ఆయుధం, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే ఎవరిని కూడా ఉపేక్షించబోమని ఆయన అన్నారు.

Post Top Ad