స్వేరోస్ ఇంటర్నేషనల్ మర్కుక్ మండలం నూతన కమిటీ ఎన్నిక. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, September 27, 2020

స్వేరోస్ ఇంటర్నేషనల్ మర్కుక్ మండలం నూతన కమిటీ ఎన్నిక.

మర్కుక్ సెప్టెంబర్ 26 (శుభ తెలంగాణ)మర్కుక్ మండలం స్వేరోస్ ఇంటర్నేషనల్ నూతన కమిటీ ని శనివారం  మర్కుక్ మండల కేంద్రం గా గజ్వెల్ డివిజన్ అధ్యక్షులు చిన్నికృష్ణ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మర్కుక్ మండలం అధ్యక్షులు గా పర్మని బాలరాజు ప్రధాన కార్యదర్శి గా కొండ బాలకృష్ణ లను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. సుప్రీం స్వేరో డా. ఆర్ ఎస్  ప్రవీణ్ కుమార్ ఐ పీ ఎస్ అడిషనల్ డీజీపీ  చేస్తున్న జ్ఞాన యుద్దానికి మేము కూడా సిద్ధం గా ఉన్నామని అందుకోసం నిరంతరం పోరాడతామని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల కమిటీ నాయకులు రమేష్, అశోక్, నాగరాజు, శ్రీకాంత్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు