యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని బిజెపి నిరసన - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 09, 2020

యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని బిజెపి నిరసన


రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 8 (శుభ తెలంగాణ) : ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం విఆర్వో, వీఆస్ట్ పోస్టులను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయంతో రాష్ట్రంలో 35,000 మంది యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతుందని నిరసన కార్యక్రమం ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఇస్తా అని మాయ మాటలు చెప్పిన కెసిఆర్ ఆరు మాసాల క్రితం ఆర్టీసీ శాఖను అణగదొక్కి, ఇప్పుడు రెవిన్యూ శాఖను నిర్వీర్యం చెయ్యడం ఇలా ఒక్కొక్క శాఖను తొలగించాలనే కెసిఆర్ నీచ నిర్ణయాల పట్ల రాష్ట్ర ప్రజలకు చెవ్విలో పువ్వులు పెట్టడమే అని బీజేపీ నాయకులు చెవుల్లో పువ్వులు పెట్టుకొని నిరసన కార్యక్రమం చేసిన బిజెపి నాయకులు. మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్, జిల్లా బీజేపీ నాయకుడు బత్తిని స్వామి,మీడియా సెల్ అనగోని అవినాష్పి,బిసి సెల్ మండల అధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్ గౌడ్ప, పట్టణ అధ్యక్షుడు తిప్పారాపు శ్రవణ్, బీజేవైఎం మండల కన్వీనర్ బండారి రాజు, బొల్లారం ప్రసన్న, పల్లె సాయి ప్రసాద్ రెడ్డి, మామిడి శేఖర్, చల్లూరి భాను,మామిడి హరీష్, ఎగుర్ల నవీన్లు తదితరులు పాల్గొన్నారు.