పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ చేసిన తాసిల్దార్... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, September 27, 2020

పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ చేసిన తాసిల్దార్...

మర్కుక్  సెప్టెంబర్ 26 (శుభ తెలంగాణ)శనివారం మర్కుక్ లోని  చేబర్తి  మరియు నరసన్నపేట గ్రామాలలో చేబర్తి సర్పంచ్ అశోక్, నర్సన్నపేట  మాధవి రాజిరెడ్డి ల ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన నూతన  పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ మర్కుక్ మండల తాసిల్దార్ ఆరిఫా చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భీమా పథకం పట్టాదారు పాసుబుక్కు ఆధారంగానే నమోదు చేసుకుంటారని జాగ్రత్తగా భద్రపరుకోవాలని వారు సూచించారు.వ్యవసాయ అధికారులను సంప్రదించి రైతు బీమా అప్లై చేసుకొని అర్హత పొందడానికి సన్నద్ధం కావాలని సర్పంచ్ దానికి సహకరించి భీమా అందరికి నమోదు చేయించాలని రైతులకు ఏ ఇబ్బంది కలిగించవద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ బాల్రెడ్డి  ఆర్ ఐ రాజు ఉప సర్పంచ్ స్వామి రైతుబంధు అధ్యక్షుడు బాల నర్సయ్య టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు మల్లేశం నాయకులు మల్లేశం డి  ఎన్ ఆర్  జై రాం తిరుపతి నర్సింలు ఆంజనేయులు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.