కళ్యాణ లక్ష్మీ షాదిముబారక్ చెక్కుల పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, September 19, 2020

కళ్యాణ లక్ష్మీ షాదిముబారక్ చెక్కుల పంపిణీ


కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 18(శుభ తెలంగాణ) కరోనా లాంటి విపత్కర పరిస్థి తుల్లో కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభు త్వం పని చేస్తోందని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఈ మేరకు కుత్బుల్లా పూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ మున్సిపాలిటికి చెందిన 58 మందికి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం కింద రూ. 58, 06,728 విలువ చేసే చెక్కులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని, సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో భూపాల్, కమిషనర్ జ్యోతి మరియు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.