భద్రాచలంలో గంజాయి పట్టివేత.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, September 18, 2020

భద్రాచలంలో గంజాయి పట్టివేత..  భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో సెప్టెంబర్ 17 (శుభ తెలంగాణ) : భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్ నందు గల ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో పట్టణ సిఐ స్వామి ఆద్వర్యంలో పట్టణ ఎస్.ఐ మహేష్ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా యంహెచ్ 03 బిజె 2020 అనే నెంబర్ గల ఎర్టిగా వాహనంను ఆపి తనిఖీ చేయగా అందులో ప్రభుత్వ నిషేదిత గంజాయి ఉండటాన్ని గమనించామని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ తనిఖీల్లో కారు నందు 126,650 కేజీల గంజాయి లభ్యమైందని, దీని విలువ 18, 99, 750/- రూపాయలు గా ఉంటుందని ఆయన తెలిపారు. పట్టుకున్న ముద్దాయిలను విచారించగా 1. సచిన్ గంగారాం చవాన్. 30 సం, 2. సుభాష్ చవాన్, 39 సం, 3, కుమార్ బాద్యు పవార్. 28 సం. 4.సుఖదేవ్ యస్వంత్ రాథోడ్ అని వీరందరూ మహా రాష్ట్ర రాష్ట్రంలోని సోలాపూర్ జిల్లాకి చెందిన వారిగా గుర్తించామన్నారు రు . భద్రాచలం పట్టణ సరిహద్దులలో 24 గంటలు పోలీస్ తనిఖీలు నిర్వహిస్తామని, నిషేదిత వస్తువులు అయిన గంజాయి, మారే యితర వస్తువులని తరలించిన వారిపై చట్టరీత్య చర్య తీసుకుంటా మని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ స్వామి, ఎస్. ఐ., బీ , మహేష్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.