హిందూ స్మశాన వాటిక పనులు ప్రారంభం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, September 19, 2020

హిందూ స్మశాన వాటిక పనులు ప్రారంభం

 


 సంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 18(శుభ తెలంగాణ): రామచంద్రపురం 112 డివిషన్ లో ఉన్న శ్రీనివాస్ నగర్ కాలనీ హిందూ స్మశాన వాటిక ను శు క్రవారం సుమారు 1.50కోట్ల పనిని 112 డివిజన్ కార్పొరేటర్ తొంట అంజయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి , ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో జిహెచ్ఎంసి కౌన్సిల్ మీటింగ్ లో రామచంద్రపురం హిందూ స్మశాన వాటిక ను మోక్ష ధామమ్ గా చెయ్యాలి అని కౌన్సిల్ లో మేయర్ తో చేర్చించి సందర్శించమని కోరగా, మేయర్ పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచనల ప్రకారం సందర్శించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,ఎంపీ,మంత్రి హరీష్ రావు కృషి వాళ్ళ వచ్చింది అని కార్పొరేటర్ తెలిపారు. త్వరలోనే ఎక్కడ లేని విదంగా మోక్షదామంగా కానున్నది అని కార్పొరేటర్ తెలిపారు. వారితో డిప్యూటీ కమిషనర్ బాలయ్య,ఆదర్స్ రెడ్డి,వార్డ్ సభ్యులు మోహన్ రెడ్డి,సుంకు సమ్మయ్య, డి.ఈ శిరీష, తొంట కృష్ణకాంత్,బీ.కే యాదయ్య, ఎల్లయ్య,ఐలేష్, పాతపల్లి ప్రభాకర్, ప్రమోద్, దేవేందర్ యాదవ్,మహిపాల్ రెడ్డి ,మోహన్ గౌడ్, సత్యనారాయణ, శ్రీనివాస్, బ్యాగారి కుల సభ్యులు పాల్గొన్నారు.